జగనన్న హయాంలోనే పేదలందరికీ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

జగనన్న హయాంలోనే పేదలందరికీ ఇళ్లు

Mar 31 2026 7:26 AM | Updated on Mar 31 2026 7:26 AM

● దొర్నిపాడులో 42.27 డిగ్రీల ఉష్ణోగ్రత ● ఆహార భద్రత కుంభకోణంపై చర్యలు

స వి వి వి

ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోం: ఎమ్మెల్యే విరూపాక్షి

టీడీపీ నేతలూ.. నోరు జాగ్రత్త

మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2026

మండే సూరీడు!

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో సోమవారం ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. నంద్యాల జిల్లా దొర్నిపాడులో అత్యధికంగా 42.27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల రూరల్‌, కోవెలకుంట్ల, కొత్తపల్లి, ఆళ్లగడ్డ, పాణ్యం మండలాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో 41.3, కల్లూరులో 41.1, మంత్రాలయంలో 40.7, ఆస్పరిలో 40.3, హొళగుందలో 40.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం సూచించింది.

ఆలూరు రూరల్‌: ఇష్టానుసారంగా మాట్లాడకుండా టీడీపీ నేతలు నోరు అదుపులో ఉంచుకోవాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత వారికి లేదన్నారు. ఆలూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. హద్దు మీరి మాట జారకుండా టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జ్యోతి ఉండాలని సూచించారు. ఆలూరు అభివృద్ధి అంటే సోషల్‌ మీడియాలో నాలుగు మాటలు మాట్లాడి పోస్టులు ఉంచడం కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఆలూరు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలని సవాల్‌ విసిరారు.

పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం

ఆలూరు ఎమ్మెల్యేగా తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాగునీటి సమ స్య, రహదారులపై అప్పటి కలెక్టర్‌ రంజిత్‌ బాషాకు నివేదిక ఇచ్చానని ఎమ్మెల్యే చెప్పారు. డీఆర్సీ మీటింగ్‌లో ఆలూరు నియోజకవర్గసమస్యలపై ప్రస్తావించి టీడీపీ జిల్లా ఇంచార్జ్‌ మంత్రి నిమ్మల రామానాయుడుకు లెటర్‌ ప్యాడ్‌పై రాతపూర్వకంగా ఇచ్చానన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద విడుదలైన నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తే ఇదే అభివృద్ధి అంటూ కథలుగా చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులు అన్ని ప్రాంతాలకు వస్తాయన్నారు. ఏ గ్రామం ఎక్కడ ఉందో, ఆ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయం టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌కు తెలియదన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తూ.. గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున, నాయకులు వెంకటేషులు, భాస్కర్‌, ఎల్లప్ప, గుండయ్య, శివ, మల్లయ్య, నాగేష్‌, అనీల్‌ రెడ్డి, వరుణ్‌ పాల్గొన్నారు.

మంత్రాలయం రూరల్‌: పేదలందరికీ ఇళ్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే వచ్చాయని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. జగనన్న కాలనీలో నిర్మించుకున్న ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదన్నారు. మండల పరిధిలోని వగరూరు గ్రామంలో సోమవారం పేదలకు ఇళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. గత ప్రభుత్వంలో కురువ రంగమ్మ నూతన గృహం మంజూరు కాగా పూర్తి చేశారు. గృహప్రవేశాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో లేఅవుట్‌లతో నిర్మించిన జగనన్న కాలనీలను ప్రజలు ఎప్పటికీ మరచిపోరన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా గ్రామాల్లో గతంలో మంజూరైన ఇళ్లకు బిల్లు మంజూరు చేయాలన్నారు. గతంలో తాము నిర్మించిన జగనన్న కాలనీలు ముళ్లపొదలతో నిండి ఉన్నాయని, వాటిని బాగు చేయాలన్నారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డికి గ్రామ నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. తహసీల్దార్‌ రమాదేవి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌, డిప్యూటీ ఎంపీడీఓ ఉపేంద్రరెడ్డి, హౌసింగ్‌ ఎఈ వీరేంద్ర, వైఎస్పార్‌సీపీ జిల్లా కార్యదర్శి విశ్వనాథరెడ్డి, మండల కన్వీనర్‌ భీమారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

ఇద్దరు అధికారులకు

రెండు ఇంక్రిమెంట్లు కట్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): వ్యవసాయ శాఖలో వెలుగులోకి వచ్చిన రూ.97.55 లక్షల కుంభకోణానికి సంబంధించి అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న జాతీయ ఆహారభద్రత మిషన్‌ నిధులు పక్కదారిపట్టినట్లు 2019 మే నెలలో గుర్తించారు. పథకానికి సంబంధించి జూనియర్‌ అసిస్టెంట్‌గా వ్యవహరించిన రాజేష్‌ అధికారుల కళ్లు గప్పి తన భార్య పేరుపై ఉన్న ఖాతాకు నిధులు మళ్లించాడు. ఈ నేపథ్యంలో జూనియర్‌ అసిస్టెంట్‌ రాజేష్‌కు చెందిన రూ.1.34 కోట్ల ఆస్తులను ఏసీబీ అటాచ్‌ చేసింది. తాజాగా సూపర్‌వైజింగ్‌ లాప్స్‌ కింద సర్వీస్‌లో ఉన్న ఏడీఏ గిరీష్‌, ఏవో అశోక్‌ కుమార్‌రెడ్డికి రెండు వార్షిక ఇంక్రిమెంట్లను పర్మనెంటుగా కట్‌ చేస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ చేసిన ఠాగూర్‌నాయక్‌, ఉమామహేశ్వరమ్మ నెల వారీ పెన్షన్‌లో 5 శాతం కట్‌ చేస్తూ జీవో జారీ అయ్యింది. అయితే సూత్రదారి రాజేష్‌పై ఇప్పటికీ చర్యలు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement