కత్తితో దాడి.. ఒకరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

కత్తితో దాడి.. ఒకరికి గాయాలు

Mar 31 2026 7:26 AM | Updated on Mar 31 2026 7:26 AM

ఓర్వకల్లు: కన్నమడకల గ్రామంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ మహేష్‌ తల్లి పద్మావతి ఈ నెల 28వ తేదీన అదే గ్రామానికి చెందిన చాకలి స్వామన్న పొలంలో కట్టెలు తీసుకురావడంతో స్వామన్న కొడుకు వెంకటేశ్వర్లు మందలించాడు. దీంతో తన తల్లిని మందలిస్తావా?.. అంటూ బోయ మహేష్‌ చాకలి వెంకటేశ్వర్లుతో తన తల్లి కాళ్లు పట్టించాడు. దీంతో కప్ప రమేష్‌ కల్పించుకొని కాళ్లు పట్టించుకోవడం తప్పవుంతుందిరా? అని బోయ మహేష్‌ను వారించాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానికులు కల్పించుకొని ఇరువురికి సర్దిచెప్పి పంపారు. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకొన్న మహేష్‌ 29వ తేదీన స్థానిక రామాలయం వద్ద మహేష్‌తో గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవలో మాటామాట పెరిగి యాట కత్తితో రమేష్‌ పొట్టలో పొడవడంతో తీవ్ర రక్తగాయం కాగా, మరో వ్యక్తి శివరాముడు చేతి వేళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం బాధితుడి ఫిర్యాదు మేరకు మహేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement