పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్‌ బస్సు

Mar 26 2026 7:30 AM | Updated on Mar 26 2026 7:30 AM

పది మందికి గాయాలు

నంద్యాల(అర్బన్‌): ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ముందు టైర్‌ పగలడంతో డివైడర్‌ దాటి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన నంద్యాల మండలం చాబోలు గ్రామ హైవే సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. 35 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మార్నింగ్‌ స్టార్‌ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు టైర్‌ పగలడంతో డివైజర్‌ను దాటి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని నంద్యాల ప్రభుత్వానికి తరలించారు. అనంతరం బస్టాండ్‌కు తరలించి సొంత ప్రాంతాలకు వెళ్లేలా సౌకర్యం కల్పించారు.

జయరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ ప్లాంటులో మంటలు

కర్నూలు(సెంట్రల్‌): ఓర్వకల్‌ మండల కేంద్రానికి సమీపంలోని జయరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ ప్లాంటులో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో గుట్టపాడు ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదం సాంకేతిక లోపంతో జరిగిందా, లేదంటే మరే ఇతర కారణంతో సంభవించిందా అనే విషయమై స్పష్టత రాలేదు. మరోవైపు ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ వివరాలు కోరగా.. ఉత్పత్తి ప్రక్రియలో ఇలాంటి ఘటనలు సాధారణమని, ఉత్పత్తి సమయంలో కొంత భాగం పక్కకకు వెళ్లడంతో పొగలు వ్యాపిస్తాయని యాజమాన్యం వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. ఈనేపథ్యంలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement