వృద్ధాప్యంలో ఏదీ కరుణ | - | Sakshi
Sakshi News home page

వృద్ధాప్యంలో ఏదీ కరుణ

Jan 26 2026 4:14 AM | Updated on Jan 26 2026 4:14 AM

వృద్ధాప్యంలో ఏదీ కరుణ

వృద్ధాప్యంలో ఏదీ కరుణ

కర్నూలు(హాస్పిటల్‌): సృష్టిలో ప్రతి ఒక్కరికీ వృద్ధాప్యం తప్పనిసరి. ఈ వయస్సుకు వచ్చిన వారు చాలా మందిలో బడలిక, నిస్సత్తువ, నీరసం, చేతగానితనం, నిస్సహాయత ఆవహిస్తాయి. ఇలాంటి సహాయంలో వారు ఇతరుల సహాయం లేకుండా సొంతంగా పనిచేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కుటుంబసభ్యులు, స్నేహితులు తోడుంటే ఫరవాలేదు. అందరూ ఉన్నా వారికి చేయూత అంతంత మాత్రం ఉంటే వారి జీవితం నరకప్రాయమే. ఇలాంటి వారికి అనారోగ్యం ఏర్పడితే కనీసం ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నా కష్టమే. ఇలాంటి వారి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేసి ఓపీ సేవలు సైతం అందించాల్సి ఉన్నా అమలు కావడం లేదు. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలి వెల్ఫేర్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2011లో నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ హెల్త్‌ కేర్‌ ఆఫ్‌ ఎల్డర్లీ(ఎన్‌పీహెచ్‌సీఈ)ని రూపొందించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో సీనియర్‌ సిటిజన్‌లకు(వృద్ధులకు) ప్రత్యేక ఓపీ అమలు చేయాలి. వారికి ప్రత్యేక వార్డు(జీరియాట్రిక్‌ వార్డు) ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో పునరావాస(వృద్ధాశ్రమా లు) కేంద్రాలు నిర్వహించాలి. వారికి అవసరమైన వైద్యపరీక్షలు, మందులు ఉచితంగా ఇవ్వాలి. 60 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్‌లకు ప్రత్యేకమైన హెల్త్‌కార్డులు జారీ చేయాలి. అవసరమైతే వైద్య సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి వైద్యం అందించాలి. వారికి సహాయంగా సేవలు అందించాలి. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏవీ అమలు కావడం లేదు. వృద్ధుల వెంట ఎవ్వరైనా కుటుంబసభ్యులు ఆసుపత్రికి వస్తేనే ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. ఒంటరిగా ఆసుపత్రిలో ఉంటానంటే ప్రభుత్వ ఆసుపత్రిలోనూ చేర్చుకోవడం లేదు. సమాజంలో సైతం వారు ఎవ్వరూ ఆదరించకపోతే వృద్ధులు అనాథగా జీవించాల్సిందే.

వైఎస్సార్‌సీపీ హయాంలో...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 2023 ఏప్రిల్‌ నుంచి ఆగష్టు నెల వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60 ఏళ్లకు పైబడిన వారు కేవలం 3,55,045 మంది చికిత్స పొందారు. 2022 సంవత్సరం సైతం 14 లక్షలకు పైగా వృద్ధులు వైద్యం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం మేరకు సేవలను సీనియర్‌ సిటిజన్‌లు అందుకున్నారు. కానీ ప్రస్తుతం వీరు అందరితో పాటే వారికి చికిత్సలు అందుకోవాల్సి వస్తోంది. సహాయకులుంటేనే వారికి చికిత్స, ఫిజియోథెరపీ వంటి చికిత్సలు అందిస్తున్నారు. సహాయకులు లేనిదే వారు ఆసుపత్రిలో అన్ని చోట్లా తిరిగే ఓపిక లేక అనాథగా ఉంటూ రోగం ముదిరి మరణించే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఫ్యామిలి ఫిజీషియన్‌ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లి వృద్ధులకు చికిత్స అందించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.

వృద్ధాప్యంలో వేధించే వ్యాధులు

మతిమరుపు, కీళ్లవాపులు, కీళ్లనొప్పులు, ఆయా సం, క్యాన్సర్‌, కంటి శుక్లం, కంటిచూపు తగ్గడం, వినికిడి శక్తి తగ్గడం, నిరాశ, డిప్రెషన్‌, మధు మేహం, రక్తపోటు, మగవారిలో ప్రొస్టేట్‌ గ్రంథి వాపు, మెదడు, నాడీ మండల వ్యవస్థలో సమస్య కారణంగా చిత్తవైకల్యం, అజీర్ణం, మలబద్ధకం, నరాల బలహీనత, వణుకుడు రోగం (పార్కిన్సన్‌), న్యూమోనియా, ఊపిరితిత్తుల సమస్యలు, చర్మం పొడిబారడం, చర్మం మీద పొలుసులు రావడం, నిద్రలేమి, అతి నిద్ర, పక్షవాతం, క్షయ, మహిళల్లో మూత్రం ఆపుకోలేని పరిస్థితి, మూత్రమార్గం ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం, గుండెజబ్బులు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో

కనిపించని ప్రత్యేక లైన్లు

ప్రత్యేక ఓపీ కనుమరుగు

అందరితో పాటు క్యూ లైన్లో

నిలబడి నీరసం

నిలబడలేక కుప్పకూలిపోతున్న వైనం

కుటుంబసభ్యులు ఎత్తుకుని

ఓపీకి వెళ్తున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement