పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించండి
ఓర్వకల్లు: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై ఆరా తీశారు. డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింక్‌లపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి శిక్ష పడేలా చూడాలన్నారు. సైబర్ నేరాలు, మహిళల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, డీసీఆర్‌బీ సీఐ గుణశేఖర్‌బాబు, స్థానిక ఎస్‌ఐ సునీల్ కుమార్ పాల్గొన్నారు.


