జాతీయ వెబ్‌నార్‌లో సిల్వర్‌జూబ్లీ విద్యార్థి ప్రతిభ
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ విద్యార్థి ఇ.లక్ష్మీనరసింహ అద్దంకిలోని కె.ఆర్.కె ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగిన మేధా–జాతీయ వెబ్‌నార్‌లో పాల్గొని ప్రనతిభ చూపించారు. ఈ మేరకు మంగళవారం సిల్వర్‌జూబ్లీ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్, క్లస్టర్ యూనివర్సిటీ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ డా.జి. శ్రీనివాస్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థి వెబ్‌నార్‌లో పాల్గొని వ్యాసరచన, మౌఖిక ప్రదర్శన పోటీల్లో రెండో బహుమతితో పాటు రూ.1500 నగదు బహుమతి గెలుచుకోవడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఆ కాలేజీ అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం
లారీ పట్టివేత
మంత్రాలయం రూరల్: అక్రమంగా రేషన్‌బియ్యం తరలిస్తున్న లారీని మండల పరిధిలోని మాధవరం చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. ముందుస్తు సమాచారం ప్రకారం రెవెన్యూ అధికారులు ఆర్‌ఐ జనార్ధన్ రావు, వీఆర్‌ఓ రంగస్వామి, మంత్రాలయం ఎస్‌ఐ శివాంజల్ మాధవరం చెక్‌పోస్టు వద్ద వాహనల తనిఖీ చేపట్టారు ఆదోని వైపు నుంచి రేషన్ బియ్యం లారీ వచ్చింది. దానిని ఆపి తనిఖీ చేయగా దాదాపు 700 బస్తాల పీడీఎస్ రైస్ బియ్యం కనిపించాయి. ఆ బియ్యాన్ని సాధ్వీనం చేసుకొని ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన డ్రైవర్ షేక్‌లాల్ కుల్దీప్, మహారాష్ట్రకు చెందిన క్లీనర్ రీతిక్ సాహును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు సీఐ శివాంజల్ తెలిపారు.
మతసామరస్యానికి ప్రతీక
పత్తికొండ రూరల్ : అయ్యప్ప భక్తులకు ముస్లింలు అన్నదానం ఏర్పాటు చేసి మతసామర స్యాన్ని చాటుకుంటున్నారు. తాజాగా పత్తికొండలో మొలల డాక్టర్ మౌలాలి అయ్యప్ప మాల ధరించిన భక్తులకు భిక్ష ఏర్పాటు చేశా రు. వారితో కలిసి భోజనం చేశారు. అయ్యప్ప భక్తుల దీక్ష విజయవంతం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
జాతీయ వెబ్‌నార్‌లో సిల్వర్‌జూబ్లీ విద్యార్థి ప్రతిభ


