రానున్న ఐదు రోజులు చలే!
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో రాను న్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంద ని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించా రు. గత రెండు, మూడేళ్లతో పోలిస్తే ఈ సారి చలి తీవ్రత పెరిగింది. సంక్రాంతి వరకు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కర్నూలులో కనిష్ట ఉష్ణోగ్రతలు 14.9 డిగ్రీలకు పడిపోవడం గమనార్హం. రానున్న ఐదు రోజులకు అంటే ఈ నెల 21వ తేదీ వరకు వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ ప్రకటనను విడుదల చేసింది. గరిష్టంగా ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 17 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. గాలిలో తేమ 71 నుంచి 90 శాతం వరకు ఉండటం వల్ల చలి వాతావరణం నెలకొంటుంది.
రీసర్వేను గడువులోపు
పూర్తి చేయాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో కొనసాగుతున్న రీసర్వేను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జేసీ నూరుల్ ఖమర్ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన రెవెన్యూ అంశాలపై ఆర్‌డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీసర్వే పైలట్ ప్రాజెక్టు కింద మొదటి దేశలో ఎంపిక చేసిన 25 గ్రామాల్లో క్లరికల్ సరవణలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోపు పూర్తి చేయాలన్నారు. రెండో దశలో పైలట్‌ప్రాజెక్టుగా ఎంపికై నా 24 గ్రామాల్లో మ్యూటేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఫైనల్ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలన్నారు. రీసర్వే, మ్యూటేషన్‌ల పురోగతిని నిత్యం పర్యవేక్షించాలని ఆర్‌డీఓలను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, ఆదోని సబ్ కలెక్టర్(ఇన్‌చార్జి) అజయ్‌కుమార్, ఎస్‌డీసీ నాగప్రసన్న లక్ష్మీ పాల్గొన్నారు.
సుకన్య సమృద్ధి యోజనకు సహకరించండి
కర్నూలు(అర్బన్): సుకన్య సమృద్ధి యోజన పథకానికి గ్రామ సర్పంచులు తమ వంతు సహకారం అందించాలని కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తమ పరిధిలోని 10 సంవత్సరాల్లోపు బాలికలకు సుకన్య ఖాతాను తెరిచేందుకు నగదును స్పాన్సర్ చేసి బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలని కోరారు. ఒక ఖాతాకు కనీసం రూ.250 చెల్లించాలని, ఆసక్తి కలిగిన దాతలు సమీపంలోని పోస్ట్ ఆఫీసును సంప్రదించాలన్నారు.
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్‌లో ఈ నెల 17న డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్.ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి విని యోగదారులు తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ఫోన్ ద్వారా తెలియజేస్తే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లోవోల్టే జీ సమస్యలు, విద్యుత్ సిబ్బంది అందుబాటు తదితర సమస్యలపై డయల్ యువర్ ఎస్‌ఈ దృష్టికి తీసుకరావచ్చన్నారు. వినియోగదారులు 7382614308 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయవచ్చన్నారు.


