సమ్మెకు సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

సమ్మెకు సిద్ధం!

Dec 17 2025 7:17 AM | Updated on Dec 17 2025 7:17 AM

సమ్మెకు సిద్ధం!

సమ్మెకు సిద్ధం!

అంగన్‌వాడీలకు హామీలు ఇచ్చి విస్మరించిన కూటమి సర్కారు వేతనాల పెంపుపై నోరు మెదపని వైనం ఐక్య ఆందోళనలకు సిద్ధమవుతున్న అంగన్‌వాడీలు

అంగన్‌వాడీల ప్రధాన డిమాండ్లు ...

● అంగన్‌వాడీల కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

● మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్‌ రిలాక్షేషన్‌ ఇచ్చి మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి

● హెల్పర్ల పదోన్నతులకు నిర్దిష్టమైన గైడ్‌లైన్స్‌ రూపొందించాలి

● అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి

● అన్ని యాప్‌లను కలిపి ఒక యాప్‌గా మార్చాలి. సెంటర్‌ నిర్వహణకు 5జీ ఫోన్లు ఇస్తూ, ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలి

● గ్రాట్యూటీ అమలుకు గైడ్‌ లైన్స్‌ రూపొందించడ ంతో పాటు వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ ఇవ్వాలి

● పెండింగ్‌లో ఉన్న సూపర్‌వైజర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి

● లబ్ధిదారులకు ఆయిల్‌, కంది పప్పు క్వాలిటీ పెంచాలి, అలాగే మెస్‌ చార్జీలను పెంచుతూ గ్యాస్‌ ఉచితంగా అందించాలి

కర్నూలు(అర్బన్‌): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అనేక రూపాల్లో సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల పట్ల రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది. వేతనాలు పెంచడంతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయాలని పలు రూపాల్లో ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేక పోవడంతో అంగన్‌వాడీలు సమ్మెకు ‘ సై ’ అంటున్నారు. సమస్యల సాధనలో భాగంగా చేపట్టే సమ్మెకు ముందస్తుగా ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట అన్ని సంఘాలను కలుపుకొని అంగన్‌వాడీలు భారీగా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు, గ్రాట్యూటీ, మినీ సెంటర్లను మెయిన్‌గా మార్చడం వంటివి చేస్తామని ఇచ్చిన హామీల గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంగన్‌వాడీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం చేపట్టినా తమ సమస్యలను పరిష్కరించక పోవడం వల్ల తిరిగి మూడు సంఘాలు ఐక్య ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. గుజరాత్‌ రాష్ట్ర హైకోర్టు అంగన్‌వాడీల జీతాల పెంపునకు సంబంధించి సీ/ఎల్‌పీఏ/363/2025 తేది: 20–08–2025 ప్రకారం అంగన్‌వాడీ హెల్పర్‌ను 4వ తరగతి ఉద్యోగిగా, వర్కర్‌ను 3వ తరగతి ఉద్యోగిగా గుర్తించాలని తీర్పు ఇచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే వీరి జీతాలను పే రివిజన్‌ కమిషన్‌ ( పీఆర్‌సీ )కి అనుసంధానం చేసి పీఆర్‌సీ రెకమెండేషన్స్‌ ప్రకారం పెంచాలని చెప్పిందని నేతలు పేర్కొంటున్నారు. గుజరాత్‌ హైకోర్డు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.24,800, హెల్పర్‌కు 20,300 జీతాలు పెంచాల్సి ఉందన్నారు. గుజరాత్‌ మోడల్‌ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పాలన అంటే మాట్లాడే కూటమి పాలకులు గుజరాత్‌ హైకోర్టు తీర్పును ఇక్కడ కూడా అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పీఆర్‌సీతో అనుసంధానం చేయడం వల్ల మున్సిపల్‌ ఆప్కాస్‌ వర్కర్లు, యుజీడీ వర్కర్ల జీతాలు నెలకు రూ.20 వేలకు పైగా చేరాయని, అంగన్‌వాడీల జీతాలను కూడా పీఈర్‌సీతో లింక్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

12వ తేదీన కలెక్టరేట్ల ఎదుట భారీ

నిరసనతో సర్కారుకు హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement