సమ్మె నోటీసు ఇచ్చాం ...
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామ ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చాం. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీలకు మెరుగైన వేతనాలను అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా, అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. – ఎస్ మునెప్ప, జిల్లా గౌరవాధ్యక్షులు,
ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)


