ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం ...
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్ప ర్లు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేంత వరకు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తాం. ఈ నెలాఖరు లేదా జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్త సమ్మె చేసేందుకు ఐక్య కార్మిక సంఘాలు కార్యాచరణను రూపొందిస్తున్నాయి. విధి నిర్వహణలో కష్టాలను అనుభవిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం న్యాయం చేయకుంటే పోరాటం ఉధృతం చేస్తాం. – లలితమ్మ,
రాష్ట్ర అధ్యక్షురాలు, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్
అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ)


