బాధ్యతలు స్వీకరించిన డీఈఓ
కర్నూలు సిటీ: జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎల్. సుధాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీఈఓగా ఉన్న ఎస్.శామ్యూల్ పాల్ రిలీవ్ అయ్యారు. నూతన డీఈఓ బాధ్యతలు తీసుకున్న అనంతరం ఎస్.శ్యామూల్ పాల్‌తో కలిసి జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆ తరువాత నూతన డీఈఓను వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి అభినందనలు తెలిపారు.
రిజర్వాయర్ రివిట్‌మెంట్‌కు మరమ్మతులు
అవుకు(కొలిమిగుండ్ల): అవుకు రిజర్వాయర్‌కు చెందిన రివిట్‌మెంట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు ఎస్సార్బీసీ అధికారులు సిద్ధమయ్యారు. కర్ణాటక రాష్ట్రం బెల్గాంకు చెందిన అక్షిత అండర్‌వాటర్ సర్వీసెస్ లిమిటెడ్‌కు చెందిన సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకోవడంతో గురువారం వివిధ రకాల యంత్రాలు, సామగ్రి, కెమికల్‌ను రిజర్వాయర్ వద్ద చేర్చారు. మద్రాసు ఐఐటీకి చెందిన నిపుణుల ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టనున్నారు. సోమవారం నుంచి రివిట్‌మెంట్ పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏడాది వ్యవధిలోనే రెండు సార్లు రివిట్‌మెంట్ కుంగిపోవడంతో అధికారులు తాత్కాలిక చర్యలు మాత్రమే చేపట్టారు. రిజర్వాయర్‌లో 4 టీఎంసీల నీటి నిల్వ ఉంటే కట్టకు ప్రమాదముందని భావించిన అధికారులు గాలేరు నగరి వరద కాల్వ ద్వారా వైఎస్సార్ కడప జిల్లాకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రెండు టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. కుంగిన రివిట్‌మెంట్ ప్రాంతంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేకంగా తెప్పించిన కెమికల్ సాయంతో లీకేజీ నివారణకు చర్యలు చేపట్టనున్నారు. ఈ నెలాఖరు లోగా పనులు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం పరిధిలో పద్మావతి ఏజెన్సీ కింద పనిచేస్తున్న శానిటేషన్, హౌస్ కీపింగ్ కార్మికులకు ఎట్టకేలకు ఒక నెల జీతాన్ని సంస్థ చెల్లించింది. గురువారం కార్మికులకు ఒక నెల వేతానాన్ని వారి బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. మూడు రోజుల క్రితం సాక్షిలో ‘వేతన.. వేదన!’ శీర్షికతో రెండు నెలలుగా జీతాలు అందక కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన దేవస్థాన అధికారులు పద్మావతి ఎజెన్సీపై ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు ఒక నెల వేతనాన్ని జమ చేశారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
బాధ్యతలు స్వీకరించిన డీఈఓ
బాధ్యతలు స్వీకరించిన డీఈఓ


