కొర్చెవంకలో దూసుకెళ్లిన బైక్
● తీవ్ర గాయలతో హమాలీ మృతి
హొళగుంద: స్థానిక బస్టాండ్ వద్ద బీసీ కాలనికి వెళ్లే రస్తాలో ఉన్న కొర్చెవంకలో మోటార్ సైకిల్ అదుపు తప్పి దూసుకెళ్లి తీవ్ర గాయాలతో ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. హొళగుంద పట్టణం అయోధ్య నగర్‌లోని మహంకాళమ్మ గుడి వద్ద నివాసముంటున్న బోయ రొడ్డె సిద్ధప్ప(45) అనే వ్యక్తి రైస్ మిల్లుల వద్ద ట్రాక్టర్ హమాలీగా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం బైక్‌పై బీసీ కాలనీ వైపు వెళ్తుండగా బస్టాండ్ వద్ద ఉన్న కొర్చెవంకలో బైక్ అదుపు కాక వేగంగా వంకలోకి దూసుకెళ్లింది. దీంతో తల, చేతులు, మోహం మీద తీవ్ర రక్తగాయాలు కావడంతో స్థానికులు సిద్ధప్పను వంకలో నుంచి బయటకి తీయగా కొద్ది సేపటికే మృతి చెందాడు. విషయం ఎస్‌ఐ దిలీప్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆలూరుకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె ఉన్నారు.. భార్య రొడ్డె రేణుకమ్మ ఇచ్చిన ఫిర్యదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తున్న చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ శేషిరెడ్డి విలేకరులకు తెలిపారు. కాగా.. ప్రమాద జరిగిన వంక చాలా కాలంగా ప్రమాదకరంగా ఉన్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.


