వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
● జిల్లా జడ్జి కబర్ధి
కర్నూలు: వయస్సులో 70 ఏళ్ల పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడేవారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.కబర్ధి తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి గురువారం కర్నూలు పురుషుల, మహిళా కారాగారాలను తనిఖీ చేశారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపర్చాలని జైలు అధికారులకు సూచించారు. జైలులో ఉన్న ఖైదీలు వారి హక్కులను తెలుసుకోవాలని, ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా నియమిస్తామని తెలిపారు. ఖైదీలకు అందించే ఆహారాన్ని, రేషన్‌ను, వారి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఖైదీలకు ఏవైనా సమస్యలు ఉంటే కర్నూలు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నంబర్ 15100పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, అవసరమైతే హెల్ప్‌లైన్ నంబర్‌కు తమ సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో జైలు అధికారులతో పా టు లీగల్ ఎయిడ్ న్యాయవాది శివరాం పాల్గొన్నారు.


