డీఈఓగా ఎల్. సుధాకర్
కర్నూలు సిటీ: జిల్లా విద్యా శాఖ అధికారిగా ఎల్.సుధాకర్‌ను నియమిస్తూ మంగళవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సె క్రటరీ కోనా శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జూలై నెలలో డీఈఓగా పనిచేస్తున్న కె.శామ్యూల్ పాఠశాల విద్య ఆర్జేడీగా వెళ్లారు. దీంతో డీఈఓ ఆఫీస్ లో ఏడీగా పనిచేస్తున్న ఎస్.శామ్యూల్‌పాల్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. గతేడాది అక్టోబరు 25న ఏడీ వేతనంతోనే డీఈఓగా నియమించారు. ప్రస్తుతం డీఈఓగా ఎల్.సుధాకర్‌ను నియమించారు. విశాఖపట్టణానికి చెందిన ఈయన త్వరలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.


