రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
మంత్రాలయం రూరల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఐదుశాతం పెరిగాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందిని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంత్రాలయం పోలీసు స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ప్రముఖ పుణ్యకేత్రంలో వాహనాల రద్దీ లేకుండా, భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. బాధితులు పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించిన వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. డీఎస్పీ భార్గవి , సీఐ రామాంజులు పాల్గొన్నారు.


