జాబ్ క్యాలెండర్ ఎక్కడ
– కాటసాని శివనరసింహారెడ్డి
చంద్రబాబు అబద్ధపు హామీలతో యువత నిలువునా మోసపోయింది. ఎన్నికల సమయంలో యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇస్తారు. జిల్లాలో 5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా నిరుద్యోగ భృతి అందలేదు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బాబు సర్కారుకు ప్రజలే గుణపాఠం చెబుతారు. ఐటీ హబ్ ఏర్పాటులో చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు పూర్తిగా అన్యాయం చేసింది. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి సముచిత స్థానం దక్కుతుంది.


