చెలగాటమా?
చంద్రబాబూ.. నిరుద్యోగభృతి ఇంకెప్పుడు?
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే ఇవ్వాలి
బాబు మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారు
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని ధ్వజం
‘యువత మేలుకో’ కార్యక్రమానికి విశేష స్పందన
యువత భవిష్యత్‌తో
కల్లూరు: ‘టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఇప్పటి వరకు నిరుద్యోగభృతి అందలేదు. పరిశ్రమ లు ఏర్పాటు చేయలేదు. ఉద్యోగాలు రాలేదు. మోసపూరిత హామీలతో చంద్రబాబు ప్రభుత్వం యువత భవిష్యత్‌తో చెలగాటమాడుతుంది’ అంటూ వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. కూటమి ఇచ్చిన వాగ్దానాలు – చేస్తున్న మోసాలపై పార్టీ యువ నాయకుడు కాట సాని శివ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ‘యువత మేలుకో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నగర మేయర్ బీవై రామయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో సచివాలయ వ్యవస్థను అమలు చేసి సుమారుగా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి వలంటీర్లుగా ఉపాధి అవకాశం కల్పించి గౌరవవేతనం అందించామన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రూ. 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాక ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చివరి ఏడాది పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కళాశాలల్లో సర్టిఫికెట్లు తెచ్చుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేణుక, రాయలసీమ జోనల్ మహిళా విభాగం అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, మాజీ జెట్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, నాయకులు మీదివేముల ప్రభాకర్‌రెడ్డి, ఏ హనుమంతురెడ్డి, బెల్లం మహేశ్వరరెడ్డి, పాణ్యం నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యక్రమానికి భారీగా హాజరైన వైస్సార్‌సీపీ వివిధ విభాగాల నాయకులు, యువకులు
చెలగాటమా?


