తనిఖీలు చేస్తున్నా ఆగని కల్తీలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆహార భద్రతా విభాగం కార్యాలయం కర్నూలులో ఉంది. ఇక్కడ ఒక అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్‌తో పాటు ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఒక ఫుడ్ ఇన్‌స్పెక్టర్, నంద్యాలలో ఇద్దరు అధికారులు ఉన్నారు. వీరు ఒక్కొక్కరు నెలకు 12 శాంపిల్స్‌ను తీసి ల్యాబ్‌కు పంపుతున్నారు. తీసిన శాంపిల్స్ ల్యాబోరేటరికీ వెళ్లి రిపోర్టు రావడానికి కొన్నిసార్లు నెల నుంచి మూడు నెలల సమయం పడుతోంది. నివేదిక ఆధారంగా అధిక శాతం వ్యాపారులకు జరిమానాతో సరిపెడుతున్నారు. ఫలితంగా జరిమానాలు చెల్లించి మళ్లీ పాత పద్ధతిలో వ్యాపారాలు చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల అధికారులు శాంపిల్ తీసిన నూనె


