నాలుగు గ్రామాల రోడ్డును మూసివేస్తే సహించం
పాములపాడు: జాతీయ రహదారి 340సి భానుముక్కల టర్నింగ్ వద్ద కర్నూలు వైపు నుంచి బస్సులు వచ్చే దారిని పీఎస్కే కంపెనీ వారు మూసి వేసేందుకు ప్రయత్నించగా భానుముక్కల, బానకచర్ల గ్రామస్తులు అడ్డుకున్నారు. భానుముక్కల క్రాస్ రోడ్డు మీదుగా భానుముక్కల, బానకచర్ల, గుండాలనట్టు, వేంపెంట, కొత్త రామాపురంతో పాటు వెలుగోడు మీదుగా నంద్యాలకు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటిది భానుముక్కల టర్నింగ్ వరకు బస్సులు రాకుండా రోడ్డును బంద్ చేసి కాస్త దూరంలో ఉన్న జాతీయ రహదారి పైనుంచి వెళ్లేలే మళ్లిస్తే సహించబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. నాలుగు గ్రాముల ప్రజలు ఏకమై రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. పీఎస్‌కే కంపెనీ సీఈఓ ప్రసాద్‌యాదవ్, మేనేజర్ చంద్రమౌళి నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి వెనుదిరిగారు. నిర్మించిన డివైడర్‌ను తొలగించారు. భానుముక్కల క్రాస్ వరకు రోడ్డును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పాములపాడు వైస్ ఎంపీపీ బండ్లమూరి వెంకటేశ్వర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.


