పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం
కర్నూలు కల్చరల్: పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని తద్వారా ఉన్నత దశకు చేరుకోవడానికి అవకాశం ఉంటుందని వక్తలు అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థలో శుక్రవారం ఇన్‌చార్జ్ కార్యదర్శి వి.పెద్దక్క అధ్యక్షతన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జేసీ నూరుల్ ఖమర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు చంద్రశేఖర కల్కూర, గంగాధర్‌రెడ్డి, విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, నిఖిల్ ఎడ్యుకేషన్ అకాడమీ అధ్యక్షుడు మద్దిలేటి, నైస్ కప్యూటర్స్ అధినేత రాయపాటి శ్రీనివాస్ ప్రారంభించారు. గాడిచర్ల హరిసర్వోత్తమవు విగ్రహం, అయ్యంకి వెంకట రమణ, ఎస్‌ఆర్ రంగనాథన్, పాతూరు నాగభూషణం చిత్ర పటాలకు అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు గ్రంఽథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి. అంతకు ముందు గ్రంథాలయాల అవగాహన ర్యాలీని జేసీ జెండా ఊపి ప్రారంభించారు. అసిస్టెంట్ లైబ్రేరియన్లు వజ్రాల గోవిందరెడ్డి, బాషా, తదితరులు పాల్గొన్నారు.


