అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వెల్దుర్తి: మండల పరిధిలోని గుంటుపల్లె గ్రామానికి చెందిన రైతు గొల్ల సుధాకర్ (40) శుక్రవారం అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీ సులు తెలిపిన వివరాలు.. సుధాకర్‌కు గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది.ఆ మహిళ శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సుధాకర్ హైవే–44 లద్దగిరి క్రాస్ దాటుకుని గోకులపాడు వెళ్లే రోడ్డు పక్కన పొలాల్లో కొన ఊపిరితో పడి ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సుధాకర్‌ను 108 వాహనంలో స్థానిక సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యు లు ధ్రువీకరించారు. మృతునికి భార్య లక్ష్మిదేవి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకుని వారంతా ఆసుపత్రికి వెళ్లి బిగ్గరగా రోదించారు. మృతుడి వెంట ఉన్న మహిళ సైతం ఆసుపత్రి వద్ద ఉండి.. తాను వెల్దుర్తికి బ్యాంకు పనిమీద వచ్చానని, సుధాకర్ ఫోన్ చేసి పిలిస్తేనే వెళ్లినట్లు తెలపడం విశేషం. పో స్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అతని మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.


