గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
పాములపాడు:మండలంలోని మద్దూరు గ్రామ పంచాయతీ మజారా కృష్ణానగర్ గ్రామానికి చెందిన వీరేష్ (17) ఎస్‌ఆర్‌బీసీ కాలువలో గల్లంతు కాగా శుక్రవారం మృతదేహం లభ్యమైంది. వీరేష్ పాములపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 13న ఎస్‌ఆర్ బీసీ కాలువ గట్టుపై ఆరబోసిన మొక్కజొన్న ధా న్యం వద్దకు కాపలాగా వెళ్లాడు. అక్కడ నీటి కోసం ఎస్‌ఆర్‌బీసీ కాలువలో దిగి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యా డు. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం మృతదేహం లభించగా ఎస్‌ఐ సురేష్‌బాబు పంచనామా నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి తండ్రి మొగులేశ్వరప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.


