వైభవం.. ప్రహ్లాద రాయల తెప్పోత్సవం
మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో మంగళవారం కార్తీక మాసం సందర్భంగా శ్రీ పరిమళ తీర్థ పుష్కరిణిలో ప్రహ్లాదరాయలు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో నిర్వహించిన తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తరలివచ్చారు. పుష్కరిణి మండపంలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతి చేతుల మీదుగా మంగళహారతులు పట్టి భక్తులను ఆశీర్వదించారు.
నేడు తుంగా హారతి, లక్ష దీపోత్సవం..
కార్తీక పౌర్ణమి సందర్భంగా తుంగా తీరంలో తుంగా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మంగళవారం తెలిపారు. శ్రీమఠం నుంచి తుంగభద్రమ్మ వరకు ప్రహ్లాద రాయలు ఊరేగింపు ఉంటుందన్నారు. లక్ష దీపోత్సవ కార్యక్రమం శ్రీమఠం ప్రాకారంలో చేపడుతున్నట్లు మేనేజర్ ఎస్‌కే శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని రాఘవేంద్రుడి ఆశీర్వాదం పొందాలని ఆకాంక్షించారు.


