దివ్య శోభితం
ఓ వైపు కార్తీదీపకాంతులు..మరో వైపు భక్తుల శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించి దీపాలను వెలిగించారు. అభిషేకాలు, రుద్రాభిషేకాలు, బిల్వార్చన, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, శివ పార్వతుల కల్యాణాలు, కార్తీక వన భోజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీశైలం, మహానందిలో జ్వాలాతోరణోత్సవం కనుల పండువగా సాగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఈ వేడుకను తిలకించారు.
కర్నూలు వినాయక ఘాట్ కేసీ కెనాల్‌లో సామూహికంగా కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు
దివ్య శోభితం
దివ్య శోభితం
దివ్య శోభితం


