అధికారుల ఆట విడుపు
కర్నూలు కల్చరల్: కర్నూలు నగర శివారులోని విజయవనం పుల్లయ్య పార్క్‌లో జిల్లా అధికారులు ఆట పాటలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. షటిల్, క్యారమ్స్, మ్యూజికల్ ఛైర్స్, ఆటల్లో, జేసీ టగ్ ఆఫ్ వార్, షటిల్, క్యారమ్స్‌లో అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఆడారు. టగ్ ఆఫ్ వార్, షటిల్ ఆటల్లో జేసీ నూరుల్ ఖమర్ టీం గెలుపొందింది. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి అవినాష్ జయసింహ పాటలు పాడి అలరించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లతో పాటు సీఎఫ్ బీవీఏ కృష్ణ మూర్తి, జిల్లా అటవీ శాఖ అధికారి పి. శ్యామల.. విజయ వనంలో మొక్కలు నాటారు. అనంతరం ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. డీఎఫ్‌వో శ్యామల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌వో వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వర రెడ్డి, హౌసింగ్ పీడీ చిరంజీవి, డీఎస్‌డీవో భూపతిరావు, ఐసీడీఎస్ పీడీ విజయ, అటవీ శాఖ ఫ్లైయింగ్ స్వ్కాడ్ రేంజ్ అధికారి రమణారెడ్డి, కర్నూలు, ఆదోని రేంజ్ అధికారులు విజయకుమార్, తేజశ్వి, తదితరులు పాల్గొన్నారు.
అధికారుల ఆట విడుపు


