భారీగా సెల్‌ఫోన్ల రికవరీ
● ఎస్పీ చేతుల మీదుగా
బాధితులకు అప్పగింత
కర్నూలు: ప్రయాణాలు, జాతరలు, ఉత్సవాలు... ఇలా పలు చోట్ల పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.1.20 కోట్ల విలువ చేసే 669 సెల్‌ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు పలు జిల్లాల నుంచి ఫోన్లను రికవరీ చేసి జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో బుధవారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించి వాటిని ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా బాధితులకు అప్పగించారు. పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను రికవరీ చేసి అప్పగించినందుకు బాధి తులు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో పాటు సైబర్ ల్యాబ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు తేజమూర్తి, కేశవరెడ్డి, నాగరాజరావు, శివశంకర్, వేణుగోపాల్‌తో పాటు సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీమ్ పోలీసులు పాల్గొన్నారు.
భారీగా సెల్‌ఫోన్ల రికవరీ


