కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ఎమ్మిగనూరు రూరల్: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోఏరియా ప్రభుత్వాసుపత్రి, మంత్రాలయం రోడ్డులో ఉన్న శివ పత్తి జిన్నింగ్ మిలు, అన్న క్యాంటీన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వంద పడకల ఆసుపత్రిని శుభ్రంగా ఉంచాలని సూపరిండెంట్ డాక్టర్ సుధాకు సూచించారు. పత్తి కొనుగోలులో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్లాట్ బుకింగ్‌లో వస్తున్న సాంకేతిక, తేమ శాతం వంటి సమస్యలున్నాయని చెప్పారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. తనిఖీలకు ముందుగా ఆమె పట్టణంలో 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు.


