పంటల నమోదు తనిఖీ
కోడుమూరు రూరల్: మండలంలోని ప్యాలకుర్తి గ్రామంలో పంట నమోదు జాబితాను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మంగళవారం తనిఖీ చేశారు. గతంలో వ్యవసాయ శాఖ సిబ్బంది నమోదు చేసిన పంటల నమోదు జాబితాను జేసీ సూపర్ చెక్ చేశారు. సిబ్బంది నమోదు చేసిన పంటల వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. కొందరు రైతులు ఉల్లి పంటను తొలగించి ఉండటాన్ని చూసిన జేసీ ఎందుకని ప్రశ్నించగా గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలాల్లోనే దున్నేసుకున్నట్లు రైతులు వాపోయారు. జేసీ వెంట కర్నూలు ఆర్డీఓ సందీప్‌కుమార్, గూడూ రు తహసీల్దార్ వెంకటేష్ నాయక్, మండల వ్యవసాయాధికారి రవిప్రకాష్ ఉన్నారు.
నేడు సెల్‌ఫోన్ల రికవరీ మేళా
కర్నూలు: చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించనున్నా రు. జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో బుధవారం ఉదయం 10 గంటలకు సెల్‌ఫోన్ల రికవరీ మేళా నిర్వహించేందుకు పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు. 600కు పైగా సెల్‌ఫోన్లను రిక వరీ చేశారు. వీటిని ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా బాధితులకు అందజేయనున్నారు.
11న వ్యాస రచన పోటీలు
కర్నూలు(అర్బన్): భారతరత్న డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి/మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 11న జిల్లా స్థాయిలో ఆయన జీవిత చరిత్రపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎస్.సబీహా పర్వీన్ తెలిపారు. ఈ పోటీలను మూడు భాషల్లో (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ) హైస్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా ఈ నెల 6వ తేదీన (గురువారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నగరంలోని గడియారం హాస్పిటల్ సమీపంలోని ప్రభుత్వ మైనారిటీ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పోటీలను నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ పేర్లను జనాబ్ డాక్టర్ షంషుద్దీన్ 9441761206 కు తెలియజేయాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
● గోనెగండ్లలో 34.2 మి.మీ వర్షపాతం
కర్నూలు(అగ్రికల్చర్): మోంథా తుపాను ప్రభావం తగ్గిపోయినప్పటికీ జిల్లాలో వర్షాలు పడుతుండటంతో పంటలకు నష్టం జరుగుతోంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు మద్దికెర మినహా మిగిలిన అన్ని మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. గోనెగండ్లలో అత్యధికంగా 34.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం మీద సగటున 10.6 మి.మీ వర్షం కురిసింది. నవంబర్ నెల సాధారణ వర్షపాతం 29 మి.మీ ఉండగా.. మొదటి నాలుగు రోజుల్లో 10.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఉదయం నుంచి పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.
వసతిగృహాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు తప్పనిసరి
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని వసతి గృహాల్లో ఫస్ట్‌ఎయిడ్ బాక్సులను అందుబాటులో ఉంచుకో వాలని జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి కె.ప్రసూన కోరారు. మంగళవారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్‌లోని సమావేశ భవనంలో జిల్లాలోని సహాయ బీసీ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో ఆమె ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టల్‌లోని విద్యార్థులతో పాటు వసతి గృహ సంక్షేమాధికారులు, సిబ్బంది కూడా ఎఫ్‌ఆర్‌ఎస్ కచ్చితంగా నమో దు చేయాలన్నారు. వసతి గృహాల్లో ఏవైనా ఘటనలు చోటు చేసుకుంటే 15 నిమిషాల్లోగా సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నా రు. కూరగాయాలు, పాలు, తదితర సరుకులకు సంబంధించి రిజిస్టర్‌ను తప్పక నిర్వహించాలన్నారు. 10వ తరగతి విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి వంద శాతం ఫలితాలు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సహాయ బీసీ సంక్షేమాధికారులు ఎం.శ్రీనివాసులు, ఆంజనేయులు నాయక్, మాదప్ప పాల్గొన్నారు.
పంటల నమోదు తనిఖీ


