పట్టపగలే ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
బనగానపల్లె: పట్టపగలే బనగానపల్లె ఎన్జీవో కాలనీ రేషన్‌షాపు సమీపంలో ప్రభుత్వ టీచర్ నాగరాజుకు చెందిన ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.15లక్షల విలువ చేసే 15 తులాల బంగారు అభరణాలు, రూ.20వేల నగదు అపహరణ చేశారు. పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ఉపాధ్యాయుడు నాగరాజు యాగంటిపల్లె గ్రామంలోని పాఠశాలకు వెళ్లారు. ఆయన భార్య మాస్తానమ్మ యాగంటి క్షేత్రానికి వెల్లారు. ఆమె మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి, ఇంట్లో బీరువా తాళం ధ్వంసం చేసి అందులోని 15 తులాల బంగారు ఆభరణాలు రూ.20 వేలు చోరీ చేశారు. విషయం తెలిసి సీఐ ప్రవీణ్‌కుమార్ క్లూస్‌టీంతో ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


