సుబ్రమణ్యేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ. 24.69 లక్షలు
పాణ్యం: ఎస్.కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ. 24.69 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ రామకృష్ణ తెలిపారు. సోమవారం ఆలయ ఆవరణలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.24,69,127 నగదు, 10.500 గ్రాముల బంగారు, 747 గ్రాముల వెండి వచ్చిందన్నారు. దేవదాయ శాఖ డివిజన్ తనిఖీ అధికారి హరిశ్చంద్రారెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, గ్రామ పెద్దలు శివరామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నందివర్గం బ్యాంకు అధికారులు, నంద్యాల బాలాజీ సేవా సమితి సభ్యులు, శ్రీరామ సేవా ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.


