కూటమి నేతలు అంతే!
అయినా.. మేము మారం!
నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎంతో మంది విగతజీవులుగా మారుతున్నారు. పెద్దలను కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పెద్దవారి నుంచి అభం శుభం తెలియని చిన్నారులకు సైతం నూరేళ్ల ఆయుష్షు తీరుతుండటం చూస్తుంటే కన్నీళ్లు వస్తాయి. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా కొందరిలో మాత్రం మార్పు రాకపోవడం బాధాకరం. మహానంది క్షేత్రానికి కొందరు ఇలా చిన్న వాహనాల్లో అధిక సంఖ్యలో పైన, కింద కూర్చుని వచ్చారు. ఎంతో విలువైన ప్రాణాలను గాలిలో దీపంలా ఉంచి ప్రయాణించడం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. – మహానంది
● పాత సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
వాహనంలో పైన, కింద కూర్చుని వెళ్తున్న భక్తులు
మెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టులు తప్పనిసరి
● ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమేష్‌రెడ్డి
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రతి మెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టులు తప్ప నిసరిగా ఉండాలని ఔషధ నియంత్రణ శాఖ ఏడీ పి.రమేష్‌రెడ్డి అన్నారు. స్థానిక వెంకటరమణ కాలనీలోని ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయంలో సోమవారం ఆ యన ఏడీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మాసిస్టులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా నార్కోటిక్స్ డ్రగ్స్, యాంటిబయాటిక్స్ వంటి మందులు విక్రయించరాదన్నారు.
10న అప్రెంటిస్ మేళా
కర్నూలు సిటీ: బి.తాండ్రపాడులోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీలో ఈ నెల 10వ తేదీన అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మేళాకు జిల్లాలోని వివిధ పరిశ్రమల పారిశ్రామికవేత్తలు హాజరై వారికి కావాల్సిన వారిని ఎంపిక చేసుకుంటారని తెలిపారు. ఆన్‌లైన్‌లో అప్రెంటిస్ కోసం https:/ apprentceshipindis.gov.in అనే పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 10వ తేదిన ఉదయం 10 గంటలకు బి.తాండ్రపాడులోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీ నందు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.
జూపాడుబంగ్లా: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో నిర్మించి, ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న సచివాలయాన్ని కూటమి నేతలు ప్రారంభించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దాదాపు ఏడాదికి పైగా రన్నింగ్‌లో ఉన్న సచివాలయాన్ని ఇప్పుడు ప్రారంభించడం ఏంటబ్బా అని జనం నవ్వుకుంటున్నారు. గ్రామస్వరాజ్య స్థాపనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కో గ్రామంలో రూ.42 లక్షలతో సచివాలయం, రూ.21 లక్షలతో రైతుభరోసా (రైతు సేవా కేంద్రం) కేంద్రాలను నిర్మించారు. 2024లో ఎన్నికల నాటికి నిర్మాణాలు పూరైనా ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభానికి నోచుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ పాలనలో నిర్మించిన వాటిని తామెందుకు ప్రారంభించాలనుకొన్నారో ఏమో కానీ ప్రారంభించలేదు. అయితే ఈ నేపథ్యంలో తాడిపాడు గ్రామంలో నిర్వహణలో ఉన్న సచివాలయం, రైతుభరోసా కేంద్రాలను సోమవారం నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు మాండ్రశివానందరెడ్డి ప్రారంభించడం పట్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఇచ్చిన వినతిపత్రాలను సైతం అక్కడే వదిలివెళ్లటంతో ‘ప్రజల సమస్యలను పట్టించుకోవటమంటే’ ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వంగల లక్ష్మీదేవి, ఎంపీడీఓ గోపికృష్ణ, తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్, ఏపీఓ రేష్మ, ఏడీ గిరీష్, ఏఓ కృష్ణారెడ్డి, వంగల కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఏటీఎం కార్డు మార్చి.. రైతును మోసం చేసి!
డోన్ టౌన్: ఏటీఎం కేంద్రంలో ఒక గుర్తు తెలియని ఆగంతుకుడు ఓ రైతును ఏమార్చి రూ.35 వేలు అపహరించిన సంఘటన సోమవారం డోన్‌లో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణగిరి మండలం అలంకొండ గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్ ఇటీవల ఆముదం పంటను విక్రయించగా మార్క్‌ఫెడ్ అధికారులు తన ఖాతాలో రూ.90 వేలు జమ చేశారు. వీటిని తీసుకెళ్లేందుకు సోమవారం డోన్ ప్రధాన స్టేట్ బ్యాంక్‌కు వచ్చాడు. అయితే తన ఖాతాకు పాన్ కార్డు లింక్ లేక పోవడంతో రూ.50 వేలు బ్యాంక్‌లో డ్రా చేసుకున్నారు. మిగిలిన డబ్బులను ఏటీఎంలో విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే మాటు వేసిన నిందితుడు తాను విత్‌డ్రా చేసి ఇస్తాను అని చెప్పి రైతు ఏటీఎం కార్డు తీసుకొని మొదట రూ.5 వేలు డ్రా చేసి ఇచ్చాడు. మిగిలిన డబ్బులు విత్‌డ్రా చేస్తున్నట్లు నటించి ‘పని చేయడం లేదు’.. అంటూ రైతు కార్డు తస్కరించి, వేరే ఏటీఎం కార్డును రైతు చేతిలో పెట్టి ఉడాయించాడు. కొద్ది సేపటి తరువాత తన ఖాతా నుంచి రూ.35 వేలు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో రైతు మోసపోయానని గ్రహించి బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించాడు. విచారణ చేయడంతో ఏటీఎం కార్డు మార్చిన సంగతి బయట పడింది. ఈ విషయంపై పట్టణ పోలీసు స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.
డీడీఓ కార్యాలయాలకు 12 మంది ఉద్యోగుల డిప్యుటేషన్
కర్నూలు (అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆత్మకూరు, డోన్, పత్తికొండలోని డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయాలకు జిల్లాపరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ కేడర్లకు చెందిన 12 మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపిస్తున్నట్లు జిల్లాపరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కూటమి నేతలు అంతే!
కూటమి నేతలు అంతే!
కూటమి నేతలు అంతే!


