అదృశ్యమైన వ్యక్తి మృతి
సంజామల: నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన వ్యక్తి సోమవారం శవమై కనిపించాడు. అక్కంపల్లె గ్రామానికి చెందిన గుర్క కుళాయి రెడ్డి (44) గత నెల 31వ తేదీ బయటకు వెళ్లి రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో భార్య పార్వతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పాలేరు వాగు వద్ద ఏమైనా ప్రమాదానికి గురయ్యాడా అనుమానంతో అక్కంపల్లి నుంచి సంజామలకు వెళ్లే రహదారిలో పాలేరువాగులో సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లతో పాలేరు వాగు వెంట గాలిస్తుండగా కుక్కల గడ్డ వంతెన వద్ద బైకును గుర్తించారు. అనంతరం గిగ్గమ్మ గుడి సమీపంలో గుర్క కుళాయి రెడ్డి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతునికి భార్య పార్వతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పరీక్షలు అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ రమణయ్య తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
కర్నూలు (టౌన్): ఎద్దులదొడ్డి– తుగ్గలి రైల్వే స్టేషన్‌ల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. వయస్సు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందని, నలుపు, తెలుపు రంగు డిజైన్ గీతలు కలిగిన ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నషం కలర్ ప్యాంట్, బ్లూ కలర్ డ్రాయర్ వేసుకున్నట్లు సోమవారం రైల్వే పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
డోన్ టౌన్: ధర్మారం గ్రామంలో ఓ ఇంటిలో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డోన్ అగ్నిమాపక కేంద్రం అధికారి రంగస్వామిగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ మణి ఇంటిలో సోమవారం మధ్యాహ్నం టీవీ వద్ద ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులో మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో విద్యుత్ పరికరాలు, ధాన్యం, దస్తులతో పాటు దాచుకున్న రూ. 15 వేల నగదు కాలి బూడిదైనట్లు బాధితురాలు తెలిపారు.
అదృశ్యమైన వ్యక్తి మృతి
అదృశ్యమైన వ్యక్తి మృతి


