
చిట్టి చేతులు.. వెట్టి చాకిరి
ఇక్కడ గుడ్ల బాక్స్‌లను మోసుకుంటూ వెళ్తున్న విద్యార్థులు కోవెలకుంట్ల మండలం చిన్నకొప్పెర్ల ప్రాథమిక పాఠశాలకు చెందిన వారు. మంగళవారం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి గుడ్లస్టాక్ వచ్చింది. ఈ స్టాక్‌ను తీసుకెళ్లి వంట ఏజెన్సీ పాఠశాలలో భద్ర పరచాలి. అయితే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులతోనే వాటిని మోయించడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. తమ భవిష్యత్తును తీర్చిదిదుకునేందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో పనులు చేయించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
–కోవెలకుంట్ల