
పురుగు మందు పిచికారీ చేస్తూ..
బేతంచెర్ల: పంటకు పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లి రైతు మృతిచెందాడు. మండల పరిధిలోని సీతారామాపురం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొడ్డుబోయిన వెంకటరమణ (45) అనే రైతు కంది పంట సాగు చేశాడు. మంగళవారం ఉదయం భార్య శకుంతలతో కలిసి పంటకు పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. మందు పిచికారీ చేసే సమయంలో హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే భార్య అతడిని బేతంచెర్ల ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇంటి పెద్ద మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడికి ఇద్దరు పిల్లలు సంతానం