ఆలయ నిర్మాణానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే విరాళం | - | Sakshi
Sakshi News home page

ఆలయ నిర్మాణానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే విరాళం

Oct 20 2025 9:30 AM | Updated on Oct 20 2025 9:32 AM

ఆదోని రూరల్‌: మండలంలోని గణేకల్‌ గ్రామంలో ఉన్న బంగారమ్మవ్వ దేవాలయ నిర్మాణానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి రూ.1,01,000 విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అవ్వవారి ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఆలయ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేవత ఆశీస్సులు సాయిప్రసాద్‌రెడ్డిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ధర్మయ్య, ఉచ్చీరప్ప, లక్ష్మయ్య, గోపాల్‌, చిన్న ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి

కర్నూలు(అర్బన్‌): యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని తులసీ గ్రూప్‌ చైర్మన్‌ తులసీ రామచంద్ర ప్రభు అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో రాయల అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌, శ్రీ కృష్ణదేవరాయ ఎయిడ్‌ ఫర్‌ పూర్‌ అండ్‌ అండర్‌ ప్రివిలైజ్డ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పేద బలిజ విద్యార్థులకు మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి చంద్రబాబు, మాజీ అధ్యక్షులు యర్రంశెట్టి నారాయణ రెడ్డి, రోపా అధ్యక్షులు చింతలపల్లి రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి కోనేటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అందిస్తున్న స్కాలర్‌షిప్స్‌ ఉన్నత చదువులకు తోడ్పాటును అందిస్తుందన్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 180 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ.9 లక్షలను స్కాలర్‌షిప్స్‌ రూపంలో అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌరు జనార్దన్‌రెడ్డి, కొట్టే చెన్నయ్య, బాలరాజు, భాస్కర్‌బాబు, మల్లికార్జునమూర్తి, మలిశెట్టి దివాకర్‌, గాండ్ల లక్ష్మన్న, మండ్లెం రవి, సింగంశెట్టి సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

22 నుంచి బస్సుయాత్ర

ఆదోని సెంట్రల్‌: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్‌ 12వ తేదీ వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సుయాత్ర చేపడుతున్నట్లు ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్‌ బాషా, నిర్మాణ బాధ్యులు గిడ్డయ్య తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను ఆదోని పట్టణంలోని ఏఐవైఎఫ్‌ కార్యాలయంలో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంవగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభు త్వం పీపీపీ విధానం పేరుతో మెడికల్‌ కళాశాలలను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిలా ఆఫీస్‌ బేరర్స్‌ శరత్‌ కుమార్‌, రంగస్వామి, థామస్‌, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

రైతు అదృశ్యం

బండి ఆత్మకూరు: కడమల కాలువ గ్రామానికి చెందిన ఓ రైతు పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని ఎస్‌ఐ జగన్‌మోహన్‌ ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన చాకలి పెద్ద వెంకటేశ్వర్లు (57) శనివారం సాయంత్రం పొలం దగ్గరకు వెళ్తున్నానని ఇంటిలో చెప్పి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టు చుట్టు పక్కల, బంధువుల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. అతని కుమారుడు చాకలి సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.

ఆలయ నిర్మాణానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే విరాళం 1
1/2

ఆలయ నిర్మాణానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే విరాళం

ఆలయ నిర్మాణానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే విరాళం 2
2/2

ఆలయ నిర్మాణానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement