ఆదోని సెంట్రల్: సమస్యల పరిష్కారానికి రాయలసీమ స్పిన్నింగ్ మిల్ కార్మికులు ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) జిల్లా కార్యదర్శి వెంకప్ప తెలిపారు. ఆదోని రాయలసీమ మిల్లు కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిల్లు మూతపడి 25 సంవత్సరాలు అవుతున్నారు 150 మంది కార్మికులకు పీఎఫ్, పెన్షన్ రాలేదన్నారు. సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి తీసుకొని వెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఏఐకేఎంఎస్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఐఎఫ్‌టీయూ నాయకుడు నారాయణ, కార్మికులు కుమార్, మల్లికార్జున, రెడ్డి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం
కర్నూలు(సెంట్రల్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల కోసం దశల వారీగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ అంజిబాబు, పీఎస్ రాధాకృష్ణ, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.నాగరాజు తెలిపారు. ఆదివారం కార్మిక, కర్షక భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకోవాలంటే మిన్నకుండిపోవడం అన్యాయమన్నారు.
gê¡Ä¶æ$ çÙ*sìæ…VŠæ ´ùsîæ-ÌSMýS$ MýSÆý‡*²Ë$ }MýSÆŠæలు
కర్నూలుటౌన్: జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు కర్నూలు షూటర్ శ్రీకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా రైఫిల్ షూటింగ్ సంఘం కార్యదర్శి ఎండీ బాషా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో నిర్వహించిన 16వ సౌత్‌జోన్ స్థాయి రైఫిల్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో కర్నూలు షూటర్ శ్రీకర్ ప్రతిభ చూపారని తెలిపారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 400 పాయింట్లకు 350 పాయింట్లు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు.
27 నుంచి ‘రాయలసీమ’ కార్మికుల రిలే దీక్షలు
27 నుంచి ‘రాయలసీమ’ కార్మికుల రిలే దీక్షలు