
జగతికి నాగరికత నేర్పిందే అమ్మ!
కర్నూలు కల్చరల్: ‘జగతికి నాగరికత నేర్పింది అమ్మ. అమ్మ చరితం పొగడటం ఎవరి తరం కాదు’ అని పలువురు సాహితీ వేత్తలు అభిప్రాయపడ్డారు. సాహితీ సదస్సు, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మద్దూరు నగర్‌లోని పింగళి సూరన తెలుగు తోటలో ప్రముఖ పద్య కవి, రాష్ట్ర పతి అవార్డు గ్రహీత చేగిరెడ్డి చంద్రశేఖర రెడ్డి రచించిన ‘మాతృ దర్శనం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. సాహితీ సదస్సు అధ్యక్షులు కురాడి చంద్రశేఖర కల్కూరా, తెలుగు భాష వికాస ఉద్యమం కార్యదర్శి జేఎస్‌ఆర్కే శర్మ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. భారతీయ సాహిత్యంలో ఇప్పటి వరకు అమ్మపై ఎంత మంది కవులు కవిత్వ రాసినా అంది నిత్య నూతనంగానే ఉంటుందన్నారు. తెలుగు ఉపాధ్యాయురాలు డాక్టర్ కె.చంద్రమౌళిని, తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ దండెబోయిన పార్వతీదేవి పుస్తక సమీక్ష చేశారు. అనంతరం రచయిత కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. నరసం అధ్యక్షరాలు సుబ్బలక్ష్మమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సాహితీ వేత్తలు పోత న్న, వెంకట కృష్ణ, మారుతి, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, బసరావరాజు, మధుసూ దన శర్మ, శ్రీనివాసమూర్తి, డాక్టర్ హరికిషన్, ఎస్‌డీవీ అజీజ్ పాల్గొన్నారు.