
టపా‘కాసులు’.. బాణా‘సంచు’లు
దీపావళి పర్వదినం ఆనందంగా జరుపుకునేందుకు నగర ప్రజలు సిద్ధమయ్యారు. పండుగకు రెండు రోజుల ముందు నుంచే బాణాసంచా కొనుగోలు చేస్తున్నారు. స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రాకర్స్ దుకాణాలు రద్దీగా కనిపిస్తున్నాయి. చిన్నారులు, పెద్దలు ఆసక్తిగా రకరకాల టపాసులు కొనుగోలు చేస్తున్నారు. రేట్లు అధికంగా ఉన్నాయంటూనే కొందరు సంచులు, బ్యాగులు నింపుకుని వెళ్తున్నారు. కాగా మైదానంలో బాణాసంచా విక్రయాల సమయంలో పాటించాల్సిన నిబంధనలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
పండగ