కిసాన్‌ఘాట్ వద్ద భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన వంట పొయ్యిలు
పండగో..పబ్బమో..పెళ్లో..పేరంటమో చేయాలంటే వచ్చిన అతిథులకు భోజనాలు చేసి పెట్టేలోపు తలప్రాణం తోకకొస్తుంది. ప్రముఖుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకై తే 5 వేల నుంచి 50 వేల మంది వరకు భోజనాలు వండాలంటే వంట శాల తప్పనిసరి. మరి దేశ ప్రధాని తొలిసారి వస్తున్నాడంటే ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు లక్షలాది మందిని సమకూర్చుతున్నారు. వారందరికీ భోజనాలు వండాలంటే పే..ద్ద వంట శాల కావా లిగా.. ఇదో ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు అవే. మోదీ సభకు హాజరయ్యే అతిథులకు, సందర్శకులకు,ప్రజలకురుచికరమైన భోజనాన్ని అందించేందుకు కర్నూ లు నగరంలోని కిసాన్‌ఘాట్‌ను వంటశాలగా మార్చేశారు. అటు వెళ్లే దారిని బ్లాక్ చేసి బుధవారం నుంచే వంటల తయారీకి సిబ్బంది నడుంబిగించారు. రోడ్డుకు ఇరువైపులా వందకు పైగా పొయ్యిలు వెలిగించి వంటల తయారీలో నిమగ్నమయ్యారు. రుచికరమైన భోజనాన్ని అందించేందుకు వందలాది మంది వంట సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. మొదట సారి ఇంత పెద్ద వంటశాలను చూసి నగరవాసులు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు