
న్యాయం జరిగేంత వరకు కదలం
ఎమ్మెల్యే అఖిల ప్రియకు
దొర్నిపాడు: స్థానిక ప్రధాన రహదారిపై రెండో రోజు బుధవారం వందలాది మంది వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ బాధితులు నిరసన కొనసాగించారు. రాజారెడ్డి, వీరారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డిలను వెంటనే అదుపులోకి తీసుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలని వారు పోలీసులనను డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించారు.
ఎమ్మెల్యే హామీ ఇచ్చినా..
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ దొర్నిపాడుకు చేరుకుని బాధితుల నుంచి జరిగిన విషయం తెలుసుకున్నారు. రావాల్సిన డబ్బు తప్పకుండా ఇప్పిస్తామని నిరసన విరమించాలని కోరారు. కాగా డబ్బులిచ్చిన తర్వాతే నిరసన విరమిస్తామని, అంతరకు కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే వెనుదిరిగారు. కాగా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు శకుంతల బాధితులకు సంఘీభావం ప్రకటించారు.
తేల్చి చెప్పిన బాధితులు