
సాక్షి కార్యాలయంలో సోదాలు సరికాదు
హైదారాబాద్ సాక్షి కార్యాలయంలో పోలీసుల సోదాలు సరికాదు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఏదైనా వార్తపై అనుమానం ఉంటే న్యాయ స్థానాల ద్వారా న్యాయం పొందవచ్చు. అయితే కొందరు పోలీసులు అవేమి పట్టకుండా నేరుగా జర్నలిస్టులపై కేసులుపెట్టడం అన్యాయం. సాక్షి ఎడిటర్‌కు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన నెల్లూరు పోలీసులు ఆ పని చూసుకోవాలే కానీ అక్కడి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం.
– ఈఎన్ రాజు,
ఏపీయూడబ్ల్యూజే, జిల్లా అధ్యక్షుడు
కూటమి ప్రభుత్వం సాక్షిపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. చిన్న వార్త రాసినా జీర్ణించుకోలేక కేసులు పెట్టిస్తోంది. హైదరాబాద్ సాక్షి కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించి సిబ్బంది ని భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించ డం సరికాదు. ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పోలీసుల తీరు పత్రికా స్వేచ్ఛను హరించేలా ఉంది. వెంటనే సాక్షి ఎడిటర్‌కు ఇచ్చిన నోటీసులను వెనక్కు తీసుకోవాలి.
– కె.శ్రీనివాసులు, రాయలసీమ
జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు

సాక్షి కార్యాలయంలో సోదాలు సరికాదు