
కర్నూలుకు ఏపీ డీజీపీ
కర్నూలు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్నూలు పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త పర్యవేక్షించారు. శ్రీశైలం నుంచి మంగళవారం మధ్యాహ్నం కర్నూలు బి.క్యాంప్‌లోని పోలీసు అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆయనకు మర్యాదపూర్వకంగా పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం నన్నూరు రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన కమాండెంట్ కంట్రోల్ రూమ్‌కు చేరుకుని ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా సెక్యూరిటీ పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్, ఐపీఎస్ అధికారులు శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సెంథిల్, గోపీనాథ్ జెట్టి, ఫక్కీరప్ప తదితరులతో సమీక్షించారు.