
వైభవంగా మాల మల్లేశ్వర విగ్రహ ప్రతిష్ఠ
పత్తికొండ: పట్టణంలో నూతనంగా నిర్మించిన అలయంలో మాల మల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం వేద పండితులు హోమం నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠ పూజలు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన బీరప్ప స్వాములు ఆదోని రహదారిలో హంద్రీనీవా కాలువ దగ్గర గంగపూజ చేపట్టారు. అనంతరం పట్టణంలోని పుర వీధుల్లోకి సంప్రదాయ నృత్యంతో బీరప్పస్వాములును నూతన అలయం దగ్గరకు తీసుకొచ్చారు. కాగా మాల మల్లేశ్వర స్వాములు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హిందూపురం మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ హాజరై ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి కురువలు అధిక సంఖ్యలో తరలిరావడంతో కొండగేరి, గాంధీ నగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది.