
జీవ పరిణామం నిరంతర ప్రక్రియ
కర్నూలు(హాస్పిటల్): జీవ పరిణామం నిరంతర ప్రక్రియ అని, మనిషి మూలాలన్నీ ఆఫ్రికన్ నుంచే బయలుదేరి కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయని జనవిజ్ఞాన వేదిక నాయకులు, జనరల్ సర్జన్ డాక్టర్ కాలేషా బాషా చెప్పారు. నగరంలోని డాక్టర్ బ్రహ్మారెడ్డి హాస్పిటల్‌లోని కాన్ఫరెన్స్‌లో వైద్య విద్యార్థులకు నిర్వహిస్తున్న రెండు రోజుల హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ కాలేషా బాషా మాట్లాడుతూ.. మనిషి జీవన పరిణామక్రమం గురించి వివరించారు. డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడారు. జేవీవీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి.సురేష్‌కుమార్, రాష్ట్ర నాయకులు మహమ్మద్ మియ్యా, గోపాల్ నాయక్, రమణయ్య, శ్రీరాములు, ధనుంజయ్, మీనా, బాషా, వీరేష్ పాల్గొన్నారు.