
వినియోగదారుల్లో సంతృప్తి స్థాయి పెంచుదాం
● ఏపీఎస్‌పీడీసీఎల్ చైర్మన్,
మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్‌రావు వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ సంతృప్తిస్థాయి పెంచాలని ఏపీఎస్‌పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్‌రావు విద్యుత్ అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు శివారులోని కేవీఎస్‌ఆర్ ఆడిటోరియంలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అనే అంశంపై విద్యుత్ వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎలాంటి సమస్య ఏర్పడినా తక్షణం స్పందించేందుకు విని యోగదారులకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. పనిచేసే చోటనే నివాసం ఉండటం వల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్ గురువయ్య, కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ ఉమాపతి, కర్నూలు టౌన్ ఈఈ శేషాద్రి, ఈఈ ఓబులేసు, డీఈఈలు, ఏడీఈలు తదితరులు పాల్గొన్నారు.