
మద్దతు ధర ఎప్పుడు అందుతుందో..?
ఒకటిన్నర ఎకరాలో ఉల్లి సాగు చేశా. విత్తనాలు కొనడం మొదలు.. పంటను మార్కెట్‌కు తెచ్చే వరకు పెట్టుబడి వ్యయం దాదాపు రూ.2 లక్షల వరకు వచ్చింది. గ్రేడింగ్ చేయగా.. దిగుబడి మాత్రం 100 క్వింటాళ్లు వచ్చింది. ఉల్లిలో నాణ్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ, వ్యాపారులు క్వింటా రూ.550 ధరతో కొన్నారు. ప్రభుత్వం మాత్రం మద్దతు ధర రూ.1,200 మాత్రమే నిర్ణయించింది. వ్యాపారులు రూ.550 ప్రకారం కొనగా.. మిగిలిన రూ.650 ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు. అదీ ఎప్పటికి పడుతుందో తెలియని పరిస్థితి. మద్దతు ధర రూ.1,200 ఏ మాత్రం గిట్టుబాటు కాదు. రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే రూ.1.20 లక్షలు చేతికి వస్తోంది. కనీసం రూ.2,000 మద్దతు ధర ఉండాలి.
– గోవిందు, బోగోలు, వెల్దుర్తి మండలం