
ఉల్లి..కుళ్లి
మార్కెట్‌యార్డులో ఎవ్వరూ పట్టించుకోని ఉల్లి 1500 క్వింటాళ్ల పైనే
కర్నూలు(అగ్రికల్చర్):కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో ఉల్లిగడ్డలు కుళ్లి నీళ్లూరుతున్నాయి.మార్క్‌ఫెడ్ కొను గోలు చేసిన ఉల్లిని ఈ నెల 16న వేలం వేయగా 1500 క్వింటాళ్ల ఉల్లి మిగిలిపోయింది. దీనిని ఎవ్వరూ కొనకపోవడం.. రోజుల తరబడి ఉల్లి సంచుల్లో ఉండటంతో కుళ్లిపోయి నీళ్లు కక్కుతోంది. వర్షాలు పడినప్పుడు ఎలా చిత్తడిగా ఉంటుందో ఉల్లి నిల్వ షెడ్‌ల వద్ద పరిస్థితి అలా ఉంది. వీటిపక్కన రైతులు ఉల్లిగడ్డలు తెచ్చి అమ్మ కానికి పెట్టారు.కుళ్లిన గడ్డల ప్రభావం తాజా ఉల్లిపై పడే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే కుళ్లిన ఉల్లితో మార్కెట్ యార్డు అంతా దు ర్గంధం వెదజల్లుతున్నా మార్కెట్ కమిటీ అధికారులు, మార్క్‌ఫెడ్ అధికారులు వాటిని డంప్‌యార్డుకు తరలించే చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఉల్లి..కుళ్లి