
ఆర్‌యూలో రక్తదానం
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీలో వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన్ అమృత్ మహోత్సవ్ 2.0 కార్యక్రమంలో భాగంగా రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరాన్ని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ప్రారంభించారు. 27 మంది రక్తదానం చేయగా, 167 మంది బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు చేయి ంచుకున్నట్లు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్‌కుమార్ నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.నాగరాజు, పోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వెంకట రత్నం, డాక్టర్ బి.విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాద్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ ఆఫీసర్ డాక్టర్ జి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.