
ఇద్దరు పోలీసులకు టీచర్ ఉద్యోగాలు
నందికొట్కూరు: ఇద్దరు పోలీసులు టీచర్ ఉద్యోగాలు సాధించారు. బ్రాహ్మణకొట్కూరు పోలీసు స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఎం. జ్యోతి, పగిడ్యాల మండలం పరిధిలోని ముచ్చుమర్రి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఎస్. నాగమల్లయ్య డీఎస్సీకి ప్రిపేర్ అయి ఎస్‌జీటీ పోస్టులు సాధించారు. ఈ నేపథ్యంలో నందికొట్కూరు సర్కిల్ రూరల్ సీఐ సుబ్రమణ్యం ఆ ఇద్దరిని కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. పిల్లలకు బాగా చదువు చెప్పి మంచి టీచర్లుగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.