
రంగు మారింది!
ఆపదలో నేనున్నానంటూ కుయ్ కుయ్ మంటూ నిమిషాల్లో చేరుకునే 108 అంబులెన్స్‌లకు రంగు మారింది. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక గతంలో పనిచేసిన సంస్థ ఈ సేవల నుంచి దూరమైంది. దాని స్థానంలో భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ బాధ్యతలు తీసుకుంది. కర్నూలు జిల్లాలో 27, నంద్యాల జిల్లాలో 30 108 వాహనాలు ఉన్నాయి. ఇందులో ఆదోని, నంద్యాలలో నియోనేటల్ వాహనాలు కూడా పనిచేస్తున్నాయి. గతంలో ఈ వాహనాలకు ఆకుపచ్చ రంగు మిలితమై ఉండగా ఇప్పుడు తెలుపు, ఎరుపు రంగు వెనుక భాగంలో బ్యానెట్‌కు పసుపుతో రంగులు మార్చారు. రోజూ కొన్ని వాహనాలను రంగులు మార్చేందుకు పంపుతుండటంతో ఆయా స్థానాల్లో అంబులెన్స్ సేవల్లో జాప్యం ఏర్పడుతోంది. కాగా గతంలో పార్టీ రంగులు ఎలా వేస్తారని ప్రశ్నించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు చేస్తున్నదేమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
–కర్నూలు(హాస్పిటల్)

రంగు మారింది!